Thursday, October 23, 2008

అందమైన నా చిన్ని లోకం

నా పేరు శ్రీ హరి సుధా ...... మా శ్రీ వారి పేరు కిషన్ ప్రసాద్ ........ మాకు ఇద్దరు బంగారు పిల్లలు .....ఇద్దరి పేర్లు సాహితీ మహతి ........ఎంతో ముద్దగా వుంటారు .....బంగారు తల్లులు ....... మా ఇల్లు చిన్న సంగీత నిలయం .....
మా శ్రీవారు పాటలు బాగా పాడుతారు అంతే కాదు ఈల పాట కూడా ఎంతో బాగా వేస్తారు ......మా పిల్లలు కూడా బాగా పాడుతారు ......మరి పాడేవాళ్ళు వుంటే వినే వాళ్ళు వుండాలి కదా .......అది ఎవరో ఈ పాటికి గ్రహించే వుంటారు ......
ఇంకెవరు నేనేనండి .........ఇన్నాళ్ళ వాళ్ల సావాసం తో కొంచెంగా వాళ్లు పాడే దాంట్లో ఎప్పుడైనా తప్పులు వస్తే అది చెప్పగలుగుతున్నాను ..
మా చిన్నిబంగారు లోకం లో మేము నలుగురము ఎంతో ఆనందంగా వుంటాము ....అప్పుడప్పుడు కలహాలు కోపాలు తాపాలు మూతి ముడుచుకోవటం అంతలోనే నవ్వుకోవటం సరదాగా ఇందాక ఇలా కోపం తేచుకున్నాము అని పేరడీ పాటలు పాడుకోవటం ....ఇలా సాగే మా ప్రపంచంలోకి ఒక అబ్బాయి ప్రవేశించాడు .....అతని పేరు సుధీర్ ....అతను ఎవరా అనుకుంటున్నారా మా అల్లుడు .....మా అల్లుడు ఎంతో మంచి వాడు .....మాకు మా అబ్బైలాగా వుంటాడు .....ఈ విషయం లో మా అమ్మాయి మేము చాలా అదృష్టవంతులం ......మా సుధీర్ కవితలు రాస్తాడు
మిగిలిన విషయాలు ఈ సారి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాము

Thursday, October 2, 2008

Chinni bangaru lokam

హలో హాయ్ నా చిన్ని బంగారు లోకం కి స్వాగతం