Sunday, November 1, 2009

ఉత్తరాదిమఠము

హంసనామక పరమాత్మునిచే ప్రవర్తితమైన, హంసనామక పరమాత్ముడే మూల శ్రోతస్సుగా కలిగియున్నతువంటి భవ్యమైన, దివ్యమైన, ఉజ్వలమైన పరంపర శ్రీ ఉత్తరాదిమఠము. నిర్దిష్టమైన కేంద్రం, కాలం, దేశం, గోత్రం, వంశం, వ్యక్తులకు సీమితం కానటువంటి పరమహంసుల పరమ పవిత్రమైన పరంపరయే శ్రీ ఉత్తరాదిమఠము.

హంస నామకుడైన శ్రీహరియే ఉద్దేశ్యాన్ని వుంచి భవ్యమైన పరంపరాను ప్రవర్తించేనో ఉద్దేశ్యాన్ని అప్పటినుండి ఇప్పటివరకు నిరంతరంగా, సక్రమంగా, నిర్విరామంగా దీక్షాబద్దులై పీఠంలో విరాజమానులైనటువంటి ప్రతి యొక్క కీర్తి, మహాత్మ్యాలకు ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు.

పీఠంలో విరాజమానులైనతువంటి వారిలో శ్రీ మదానంద తీర్ధ భగవత్పాదాచార్యుల సన్నిధానము విశేషముగా ఉన్నది. విషయము మనకు పేఠాదిపత్య్యాన్ని అధిష్టిమ్చినతువంటి యతివరేణ్యుల విలక్షణమైన తప:శక్తి మరియు వ్యక్తిత్వముచే స్పష్టంగా తెలుస్తుంది. అందరి ప్రత్యక్షానుభావమూ దీనికి ప్రమాణము.

మహాపీథంలొ ప్రధానంగా రెండు విధాలుగా భగవంతుడి ఆరాధన నడుస్తుంది .

౧. బ్రహ్మ కరార్చిత మరియు మధ్వకరార్చిత ప్రతిమల పూజారూపమైన ఆరాధన మరియు

. సచ్చాస్త్ర పాఠము, ప్రవచనము, సత్సింద్దాంత స్థాపనము, పరమత నిరాకరణ పూర్వక స్వమత స్థాపన రూపమైన భగవదారాధన.

మాధ్వ సిద్దాంతానికి పీఠము ఒక మూల స్తంభము. ఇప్పటివరకు పీఠం లో అలంకృతులైన ప్రతి యొక్క పీఠాధిపతి నిరంతరముగా పాఠ ప్రవచనములు, ప్రతివాది నిగ్రహము, శిష్యుల నిర్మాణము, గ్రంధ రచన, తప్త ముద్రాదారణ మొ. కార్యములచే మాధ్వప్రపంచాన్ని సంవత్భారితంగా, సుభద్రంగా తీర్చిదిద్దినారు. ఇప్పటికీ పరంపరా అవిచ్చిన్నముగా, అవ్యాహతంగా నడుస్తుంది.

Wednesday, December 17, 2008

పుట్టుక గురించి నాకు కలిగిన అభిప్రాయము

పుట్టుకను గురించి ఆలోచించినప్పుడు చాలా సహజంగా జరిగేక్రియ అని మనకు అనిపిస్తుంది. కాని దాని లోతు పాతులను విచారించినప్పుడు మాత్రము పుట్టుక యొక్క కష్ట-నష్టములు మనకు తెలుస్తాయి. సాధారణంగా ప్రతి మానవుడు తాను జివించినంతకాలము ఏ ఒడుదుడుకులు లేకుండా జీవించాలనే అనుకుంటాడు. తాను తలచినట్లు జీవితము సాగాకపోఎటప్పటికి ఇబ్బందులకు గురి అవుతాడు. తనకు అట్టి పరిస్థితిలు ఎందుకు సంభవించినవి ? వాటిని పోగొట్టుకునే ప్రయత్నము ఎట్లా చెయ్యాలి? క్రిందటి జన్మలో నేను చేసిన దానికి ఇది ఫలములా? అని మనలను మనం ప్రశ్నించుకున్నప్పుడు కొంత మానసిక ఆమ్దోళనకు గురి అవుతాము. ఎందుకంటే మనలో కాస్త ఇమ్గిట్ జ్ఞానం వున్నట్లయితే అలా ఆలోచన కలిగినప్పుడు మనము తోటివారిని మన మాదిరిగానే గుర్తించి వారికి మనవలన ఏదైనా సహాయము కావలసి వచ్చినచో చేయగలుగుతూ తోడ్పడవచును .మనకు వచ్చిన విద్యను వారికి అందించవచ్చు. ధన సహాయము చేయగలిగే స్థోమత వున్నప్పుడు ఇవ్వవచ్చు. ఇట్లా ఏరకముగానైనా మనము సహాయపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము చేసుకున్న మంచి పనులు మన వేంటనే వుంటాయని శాస్త్రము చెప్పుచున్నది కాబట్టి. కాని ఇది మనకు గట్టిగా తెలిసిన విషయమైనప్పటికి మనకు మరల జన్మ వస్తుందంటేనే ఒక రకమైన భయము కలుగుతుంది. ఈ సారి జన్మ ఎట్లాంటిదో ? ఇప్పటి కంటే తక్కువ స్థాయికి దిగాజారుతామేమో! ఏ పశు-పక్ష్యాది జన్మలు వస్తాయా? వాటిని ఎట్లా తప్పుకుంటాము? మరల ఎన్ని జన్మలకు మానవ జన్మ వస్తుంది? అప్పుడైనా (ఇప్పుడు గడిపిన) ఇంత మంచి అవకాశము లభిస్తుందా? అనే ఆలోచనలు మనలను వెధిస్థాఇ! నిజానికి ఆలోచిస్తే ఇవేమీ మన చేతిలో లేవు. అంతా భగవంతుని నిర్ణయమే. కాని ఆ భగవంతుని నిర్ణయమును ఒప్పుకొనుటకు మన మనస్సు అంగికరిమ్చదు. ఎందుకంటే మనలో వున్న అహంభావమే అట్లా అనిపిస్తుంది. ప్రతివారు సాధారణంగా తామూ మంచి పనులే ఆచరిస్తామని భ్రమిస్తారు. మన మంచి పనులకు తగినట్లే మన జన్మ వస్తుందని అంగికరించటానికి మటుకు ఒప్పుకోము. మనం ఇంతవరకు మంచి పని అనేది ఒకటైనా చేసామా? దాని వలన ఇతరులు కొంచెమైనా లాభమును పొందారా? ఇంక ఎంత వరకు మనం తోడ్పడగలము అని ప్రశ్నించుకోవాలి. భగవంతుడు మనకు ఇచ్చే జన్మను కృతజ్ఞాతగా స్వికరించేందుకు మనం ఇప్పటి నుంచే సిద్ద పదినట్లైన జన్మ అంటే భయము వుండదేమో. మనలను మనం బాగా తెలుసుకున్నప్పుడు గాని జన్మ అంటే భయము కలుగాదేమో! అని అనిపిస్తుంది. అంటే మన మనస్సుకి పరిపక్వదశ రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన జన్మ కంటే వేరొక జన్మ వచ్చినా అంగీకరీంచేందుకు మన మనస్సుకి తర్ఫీదు ఇవ్వాలని అనిపిస్తుంది.

Tuesday, December 9, 2008

రామాయణములోని ఘట్టములలో పద్దెనిమిది విషయాలలో శ్రీరాముని పురుషోత్తమత్వము ఈవిధముగా స్పష్టము కాగలదు

౦౧. బ్రహ్మాది దేవతలందరు రావణాసురుని బాధలు పడలేక శ్రీమన్నారాయణుని శరణువేడగా కౌసల్యాదశరధులకు రామ పుత్రుడుగా అవతరించేదనని చెప్పి శ్రీమన్నారాయణుడు అభయమిచ్చి తానే రాముడుగా జన్మించుట.

౦౨. అహల్యను గౌతమ మహర్షి శపించినప్పుడు ఆమె శాపాంతమును గురించి తెలియచెయ్యమని ప్రార్ధింపగా గౌతముడు అనేక సహస్రవర్షానంతరమున ఆ పరమేశ్వరుడు శ్రీరాముడుగానవతరించి ఈవనమునకు రాగాలడనియు, అప్పుడు ఆమహాపురుషుని వల్ల అహల్య పవిత్రురాలు కాగాలదనియు గౌతముడు ముందుగానే రాముని దివ్య సంభవత్వమును గురించి ముచ్చతించుట.

౦౩. దానికి తగినట్లుగానే దశరధుని పుత్రకామేష్టి పూర్తి కాగానే అగ్ని కుండము నుండి ప్రాజాపత్య పురుషుడు దివ్య పాయసముతో సాక్షాత్కరించి దశరధుని కాపాయసము నివ్వగా దానిని కౌసల్య, సుమిత్ర, కైక, అను ముగ్గురు భార్యలు భుజింప వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉదైంచుట.

౦౪. విశ్వామిత్రుడు తన యాగసంరక్షనార్ధమై రాముని పంపవలసినదని దశరధుని కోరినపుడు విశ్వామిత్రుడు ఆసభలో సత్యపరాక్రముడును, మహాత్ముడును అగు రాముని విశిష్టతను నేనే ఎరింగినవాడను. తపశ్శాలియగు నీ వశిష్ట మునీంద్రుడు ఎరుగును. తపోనిష్టులగు మునులుగూడ ఎరుంగుదురు. అని రాముని ప్రశంసించుట.

౦౫ పదమూడు సంవత్సరములు వయస్సుగల రాముడు మారీచ సుభాహులను హత మొనర్చుట.
౦౬. శాపగ్రస్తురాలైన అహల్యను శాపవిముక్తురాలుగా చేయుట, అంతట అహల్య రాముని పరమేస్వరునిగా స్తుతించుట.
౦౭. అయిదు వేలమంది మహాయోధులు ఎత్తలేని శివధనుస్సును తేలికగా ఎత్తి భంగము చేయుట.
౦౮. ఇరువది యొక్క సారి క్షత్రియ నిర్మూలనము చేసిన పరశురాముడు అను మహాశురుని అనాయాసముగా జయించుట.
౦౯. శరభంగసుతిక్షనాది మహర్షులనేకులు శ్రీరాముని తమ తమ ఆశ్రమములకు గోంపోయి పరమేస్వరునిగా స్తుతించుట.
౧౦. జటాయువుకు అంత్యక్రియలు గావించి అతనియందుగల వాత్యల్యముచే అతనికి ఎవరికిని సాధ్యముకాని ఉత్తమ లోకప్రాప్తిని అనుగ్రహించుట.
౧౧. చతుర్ధ శహస్ర రాక్షసుబలముతో వచ్చిన ఖరదూషనాది రాక్షసులను త్రుటి కాలములో నొక్కడు వధించుట.

౧౨. సుగ్రీవునకు విశ్వాసము కలిగించుటకై ఒకే బాణముతో సప్త తాళముల పడగొట్టుట.

౧౩. పర్వతాకారముగనున్న దుందుభికంకాలమును పాదాంగుష్టముతో దశయోజన దూరమునకు ఎగురగోట్టుట.

౧౪. రావణుని చిన్ని పురువుగా పట్టుకొని నాల్గు సముద్రములలోను ముంచి తేల్చిన అఖండ బలశాలి యగు వాలిని సంహరించుట.

౧౫. విభీషణ శరణాగతి సన్నివేశములో సుగ్రీవుడు విభిషనుని స్వికరింపవద్దని అడ్డుపడగా రాముడు తానూ ఇచ్ఛయించినచో సర్వలోకములను నశింప చేయగలను అని వ్యక్తపరచుట.

౧౬. చివరకు రావణాది మహారాక్షసులను మూలబలమును కూడా అవలీలగా సంహరించుట.

౧౭. రావణుడు యుధములో పడిపోయి రామున్ని చూచి ఎవ్వని పరాక్రమము వలన రాక్షసులందరూ మరనించిరో అట్టి శ్రీరాముడు శ్రీమన్నారాయనుడే అగును అని కీర్తించుట.

౧౮. రావనవధానంతరము సీత అగ్ని పరీక్షలో విజయవంతముకాగా, అగ్ని దేముడు దేవతాగనముతోను బ్రహ్మ దేవునితోను సాక్షాత్కరిమ్చగా బ్రహ్మ దేముడు రామునితో 'రామా! నీవు శ్రీమన్నారయనుడవు, చక్రమును ధరించి యుందువు. నీవు అక్షరమగు పరబ్రహ్మవు, నీకు ఆది లేదు. జగములు ఉన్నపుడును, లయమైన తరువాతను నీవు నిలిచియుమ్డువు. నీవు యింద్రియములకు అధిపతివి, పురుషుడగు జేవుడును, పురుషోత్తముడగు ఈశ్వరుడును గూడ నీవే. ఈ సీతయే మహాలక్ష్మి, నీవే ప్రజాపతివి. రావణుని వధింప మనుష్యుడవైతివి. నీ భక్తులకు సకలములగు కోరికలను సిద్ధించుచూ అతి పురాతనుడవగు నిన్నెవరు భక్తితో పూజించి, తలచుచుండురో, వారీలోకమందును పరలోకమునందును గూడ కోరినవానిని పొందగలరు.

ఇట్టి సన్నివేశము లెన్నియో రాముని పురుషోత్తమత్వమును ధర్మనిగ్రహత్వమును చాటుచున్నవి.

జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ