Friday, November 28, 2008

రామో విగ్రహవాన్ ధర్మ:

రామో విగ్రహవాన్ ధర్మ: అనగా ముర్తిభావించిన ధర్మమే రాముడని అర్ధము. అట్లైనచో ధర్మమనగా నేమి అని ప్రశ్న పుట్టును. 'వెదోఖిలో ధర్మములం ఛో దనాలక్షనోర్ధో ధర్మ:' ఇత్యాది ప్రమాణములను బట్టి వేదములో విధినిషేదాది రూపముగా చెప్పబడిన దే ధర్మమని తేలుచున్నది. ఇట్టి ధర్మము ప్రవృత్తి రూపమునిన్ని రెండు విధములుగానున్నది. ప్రవృత్తి ధర్మము జీవులకు సాక్షాదభ్యుదయ హేతువై చిత్తశుద్ధి ద్వారమున జ్ఞానసాధనమై నిశ్శ్రేయసమునకు సాక్షాద్దేతువగుచున్నది. నిశ్శ్రేయసమనగా మోక్షము. కనుక రాముడు ఈద్వివిధ రూపధర్మము మూర్తిభవిమ్చిన స్వరూపము అని తేలుచున్నది.

Thursday, November 27, 2008

వాల్మీకి రామాయణం లో రాముని వర్ణన

వాల్మీకి రామాయణం లో రాముని వర్ణన
బాలకాండలో, పరశురాముడు రాముని గురించి,
అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోథ్థమమ్
రామా! నిను నాశనము లేనివానినిగాను, మధువను రాక్షసుని జంపినవానినిగను, దేవతలలో శ్రేస్టునిగాను కూడా యెరుగుదును.
అయోధ్యకాండలో సుమిత్ర రాముని గురించి -
దైవతం దేవతానాం చ భూతానాం భూతసత్తమ:
దేవతలకు కూడా దేవుడవు. భూతములకు కూడా శ్రేష్టమగు భూతమవు.
అరణ్యకాండలో శబరీ రాముని దేవవర (దేవతలలో శ్రేష్టుడు).
కిష్కిమ్ధకామ్డలో తార రాముని గురించి
మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త:
మానవుల దేహములందలి సామాన్య తేజమును విడిచి, దివ్య దేహములందుమ్డు తేజమును ధరించి యున్నాడు.

సుందరకాండలో హనుమంతుడు రాముని .....
లోకత్రయనాయక............. లోకత్రయమునకు నాయకుడని ప్రశంసించెను.
యుద్దకాండలో మాల్యవంతుడు రాముని గురించి
విష్ణుం మన్యామహిదేవం మానుషం దేహ మాస్థితం
మనుష్య దేహమును స్వీకరించిన విష్ణు దేవునిగా తలచుచున్నాను.
రావణాసురుడు రాముని గురించి
తం మన్యే రాఘవం వీరం నారాయనంనామయం
రాఘవుడు అనామయుడైన నారాయణుడు అని తలచుచున్నాడు.
బ్రహ్మ దేవుడే రాముని గురించి
భవాన్నారాయనో దేవ: ......నీవు నారాయనుడవే అని ప్రశంసించెను
రాముడు కేవలము పరమేశ్వరుడే అని భోధపడుతున్నది .........
అని వాల్మీకి రామాయణంలో రాముని వర్ణన వున్నది అని శ్రీ విద్యా శంకర భారతీ స్వాముల వారు వర్ణించిరి

Sunday, November 16, 2008

శ్రీ రామ శబ్దము యొక్క అర్ధము

రామ అను శబ్దము యొక్క అర్ధము ఒక పుస్తకము లో ఎంతో చక్కటి వివరణ శ్రీ విద్యా శంకర భారతి స్వాముల వారు ఇచ్చారు .ఆ వివరణ ఇందులో పొందుపరుస్తున్నాను.

రామ అనగా రమయతి సర్వాన్ గునైరితి రామ: అను వ్యుత్పత్తిని బట్టి తన గుణములచే నందరిని అనందపరచువాడు కనుక రాముడు అని అర్ధము. రామంతేస్మిన్ సర్వే జనా: గునైరితి రామ: అను వ్యుత్పత్తిని బట్టి గుణముల చేత జనులందరు ఎవరియందు ఆనందించు చుమ్దురో అట్టివాడు రాముడు అని అర్ధము. ఇంకను రామరాహస్యోపనిషత్తులో రామ ఏవ పరం బ్రహ్మ రామ ఏవ పరం తప:రామ ఏవ పరం తత్వం శ్రీ రామో బ్రహ్మతారకం అనిన్ని , రామతాపన్యుపనిషత్తులో రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదె నాసా పరబ్రహ్మ విధీయతే అనిన్ని సదా రామోహమస్మితి తత్వత: ప్రవదంతి నతే సంసారినో మానం రామ ఏవ న సంశయ: అనిన్ని వర్నింపబడుతవల్ల రాముడు సాక్షాత్ పరబ్రహ్మయే అని ద్రువపడుచున్నది. శ్రీ త్యాగరాజు కూడా రామ అను నామమును గురించి నారయనాష్టాక్షరి మంత్రమునకు జివబిజమైన రా అను అక్షరమునూపంచాక్షరీ మంత్రమునకు జివబిజమైన మా అను అక్షరమును కలిసి రామ అయిఇనది. కనుక రామ తత్త్వము పరబ్రహ్మయే అని కీర్తించాడు