Wednesday, December 17, 2008

పుట్టుక గురించి నాకు కలిగిన అభిప్రాయము

పుట్టుకను గురించి ఆలోచించినప్పుడు చాలా సహజంగా జరిగేక్రియ అని మనకు అనిపిస్తుంది. కాని దాని లోతు పాతులను విచారించినప్పుడు మాత్రము పుట్టుక యొక్క కష్ట-నష్టములు మనకు తెలుస్తాయి. సాధారణంగా ప్రతి మానవుడు తాను జివించినంతకాలము ఏ ఒడుదుడుకులు లేకుండా జీవించాలనే అనుకుంటాడు. తాను తలచినట్లు జీవితము సాగాకపోఎటప్పటికి ఇబ్బందులకు గురి అవుతాడు. తనకు అట్టి పరిస్థితిలు ఎందుకు సంభవించినవి ? వాటిని పోగొట్టుకునే ప్రయత్నము ఎట్లా చెయ్యాలి? క్రిందటి జన్మలో నేను చేసిన దానికి ఇది ఫలములా? అని మనలను మనం ప్రశ్నించుకున్నప్పుడు కొంత మానసిక ఆమ్దోళనకు గురి అవుతాము. ఎందుకంటే మనలో కాస్త ఇమ్గిట్ జ్ఞానం వున్నట్లయితే అలా ఆలోచన కలిగినప్పుడు మనము తోటివారిని మన మాదిరిగానే గుర్తించి వారికి మనవలన ఏదైనా సహాయము కావలసి వచ్చినచో చేయగలుగుతూ తోడ్పడవచును .మనకు వచ్చిన విద్యను వారికి అందించవచ్చు. ధన సహాయము చేయగలిగే స్థోమత వున్నప్పుడు ఇవ్వవచ్చు. ఇట్లా ఏరకముగానైనా మనము సహాయపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము చేసుకున్న మంచి పనులు మన వేంటనే వుంటాయని శాస్త్రము చెప్పుచున్నది కాబట్టి. కాని ఇది మనకు గట్టిగా తెలిసిన విషయమైనప్పటికి మనకు మరల జన్మ వస్తుందంటేనే ఒక రకమైన భయము కలుగుతుంది. ఈ సారి జన్మ ఎట్లాంటిదో ? ఇప్పటి కంటే తక్కువ స్థాయికి దిగాజారుతామేమో! ఏ పశు-పక్ష్యాది జన్మలు వస్తాయా? వాటిని ఎట్లా తప్పుకుంటాము? మరల ఎన్ని జన్మలకు మానవ జన్మ వస్తుంది? అప్పుడైనా (ఇప్పుడు గడిపిన) ఇంత మంచి అవకాశము లభిస్తుందా? అనే ఆలోచనలు మనలను వెధిస్థాఇ! నిజానికి ఆలోచిస్తే ఇవేమీ మన చేతిలో లేవు. అంతా భగవంతుని నిర్ణయమే. కాని ఆ భగవంతుని నిర్ణయమును ఒప్పుకొనుటకు మన మనస్సు అంగికరిమ్చదు. ఎందుకంటే మనలో వున్న అహంభావమే అట్లా అనిపిస్తుంది. ప్రతివారు సాధారణంగా తామూ మంచి పనులే ఆచరిస్తామని భ్రమిస్తారు. మన మంచి పనులకు తగినట్లే మన జన్మ వస్తుందని అంగికరించటానికి మటుకు ఒప్పుకోము. మనం ఇంతవరకు మంచి పని అనేది ఒకటైనా చేసామా? దాని వలన ఇతరులు కొంచెమైనా లాభమును పొందారా? ఇంక ఎంత వరకు మనం తోడ్పడగలము అని ప్రశ్నించుకోవాలి. భగవంతుడు మనకు ఇచ్చే జన్మను కృతజ్ఞాతగా స్వికరించేందుకు మనం ఇప్పటి నుంచే సిద్ద పదినట్లైన జన్మ అంటే భయము వుండదేమో. మనలను మనం బాగా తెలుసుకున్నప్పుడు గాని జన్మ అంటే భయము కలుగాదేమో! అని అనిపిస్తుంది. అంటే మన మనస్సుకి పరిపక్వదశ రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన జన్మ కంటే వేరొక జన్మ వచ్చినా అంగీకరీంచేందుకు మన మనస్సుకి తర్ఫీదు ఇవ్వాలని అనిపిస్తుంది.

No comments: