Friday, December 5, 2008

రామ స్వరూప నిర్ణయము

రామాయణ మహాకావ్య ఉపక్రమములో ..........కోన్వస్మిన్ సాంప్రతం లోకె గుణవాన్ .........
ఇత్యాదినా ౧౬ ఉత్తమ గుణములు గల మహాపురుషుడు ఎవరు అని వాల్మికి మహర్షి నారదముని ని ప్రశ్నించగా ఆ ౧౬ గుణములు గల వ్యక్తీ కేవలము పరమేశ్వరుడు తప్ప ఇంకొకరు కాజాలరు. అందుకు నారదుడు 'ఇక్ష్వాకు వంశ ప్రభవ: రామ:' అని వక్కానించెను. ఈ ఉపక్రమము వల్ల రాముడే పరమేశ్వరుడు అని తెలుచున్నది. ఉపసంహారము లో బ్రహ్మ దేవుడు రాముని
'తవాహం పూర్వకే భావే పుత్ర: పరపురంజయ: ' సంక్షిప్య చ పురా లోకా న్యాయయా స్వయ మేవ హి
మహార్ణ వే శాయనోప్సు మాం త్వం పూర్వ మజీజన: పద్మే దివ్యేర్కసంకాశే నాభ్యా ముత్పాద్య మామపి
ఈవిధంగా సర్వజగత్కారణమైన ప్రజాపతికి జనకత్వేన రాముడు స్తుతింపబడుటచే రాముని పరమేశ్వరత్వము స్పష్టమగుచున్నది.

No comments: